Friday, November 22, 2024

‘ఈనాడు’కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా

ఈనాడు దినపత్రికలో 40 ఏళ్లుగా పనిచేసిన కార్టూనిస్ట్ శ్రీధర్ తాజాగా ఆ సంస్థకు రాజీనామా చేశారు. ఈనాడులో ఆయన కార్టూన్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈనాడు దినపత్రికకు శ్రీధర్ వేసిన కార్టూన్‌లు ఎంతో వెన్నుదన్నుగా నిలిచాయి. 1981 ఆగస్టు 22న శ్రీధర్ తొలి కార్టూన్ ఈనాడులో ప్రచురితమైంది. 2021, ఆగస్టు 30న తాను రాజీనామా చేసినట్లు స్వయంగా శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

శ్రీధర్ కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకునేలా ఉంటాయి. ఆయన కార్టూన్‌లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోయాడు. అతను దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పాఠకులు ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతి” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటివ్‌గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్‌గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు.. దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా శ్రీధర్ తనదైన శైలిలో గళమెత్తాడు.

ఈ వార్త కూడా చదవండి: వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఆర్టీసీ బ‌స్సు

Advertisement

తాజా వార్తలు

Advertisement