Monday, November 25, 2024

Jammu : ఒక వైపు వ‌ర్షం… మ‌రో వైపు హిమ‌పాతం

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప‌లు ప్రాంతాల‌లో వరదలు వచ్చే అవకాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేవారు.. కాగా, ఈ భారీ వర్షం కారణంగా నదులు, కాలువల నీటిమట్టం పెరిగింది.

హిమ‌పాతం..

అదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో ఈరోజు తాజాగా మంచు కురుస్తోంది. సోన్‌మార్గ్‌లో 3 అంగుళాల కంటే ఎక్కువ మంచు కురిసింది. దీని కారణంగా శ్రీనగర్-లేహ్ హైవే ను మూసి వేశారు. ఇది కాకుండా, జోజిలా, సాధనా టాప్, రజ్దాన్ పాస్, దావర్ గురేజ్, తులైల్ గురేజ్, మచిల్, కొంగ్డోరి, మెయిన్ గుల్‌మార్గ్, సింథాన్ టాప్, మొఘల్ రోడ్‌లలో కూడా హిమపాతం సంభవించింది. ఇక్క‌డ కూడా వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు..

రేపు కూడా వర్షాలు

కాశ్మీర్‌లో రాబోయే కొద్ది రోజులలో ఎక్కువ వర్షాలు, తేలికపాటి మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడ కొనసాగుతున్న వర్షాల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు వానకాలం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement