Tuesday, November 26, 2024

సెఫ్టీ టెస్ట్‌లో ప్రముఖ కంపెనీల కార్లు విఫలం.. వెనుకబడిన పాపులర్‌ బ్రాండ్స్‌

మన దేశంలో భారత్‌ ఎన్‌క్యాప్‌ టెస్టింగ్‌ అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్‌కు ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్టింగ్‌ చేయిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ టెస్టింగ్‌లో మారుతీ, హుండ్యాయ్‌తో పాటు కొత్తగా వచ్చిన కియా కంపెనీకి చెందిన పలు బ్రాండ్స్‌ వెనుకబడి ఉన్నాయి.

మారుతీ సుజుకీకి చెందిన పాపులర్‌ బ్రాండ్స్‌ వాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, ఇగ్నిస్‌, ఎస్‌-ప్రెస్కో వంటి కార్లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో విఫలమయ్యాయి. ఏజెన్సీలు ఇస్తున్న రేటింగ్స్‌ ఆయా కార్లు ఎంత వరకు భద్రత ఉందో వినియోగదారులు ఒక అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంటాయి.

- Advertisement -

మారుతీ సుజుకీ అమ్మకాల్లో కీలకంగా ఉన్న వాగన్‌ఆర్‌ క్రాష్‌ టెస్ట్‌లో పిల్లల భద్రతో జీరో రేటింగ్‌ తెచ్చుకుంది. పెద్దల సెఫ్టీ టెస్ట్‌లో 1 స్టార్‌ పొందింది. ఈ కారు అందుబాటు ధరలో ఉండటం, మంచి ఆకట్టుకునే డిజైన్‌ వంటి కారణాల మూలంగా ఇది మారుతీ సుజుకీ కార్లలో అత్యధికంగా అమ్మకాలు జరుపుతున్నవాటిలో ఒకటిగా ఉంది.

మరో పాపులర్‌ కారు మారుతీ సుజుకీ కే10. ఈ కారుకు సెఫ్టీ టెస్ట్‌లో 2 స్టార్లు మాత్రమే పొందింది. ఇది మారుతీ 800 ఎంట్రీ లెవల్‌ కారు. పిల్లల సిగ్మెంట్‌లో ఈ కారుకు కూడా జీరో రేటింగ్‌ పొందింది. అత్యధిక అమ్మకాలు జరుపుతున్న స్విఫ్ట్‌ కొత్త వెర్షన్‌లో అనేక భద్రత పరమైన ఫీచర్లను జోడించినప్పటికీ గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో కేవలం 2 స్టార్లు మాత్రమే పొందింది.

హ్యుండాయ్‌ ది అదేదారి…

హ్యుండాయ్‌ కంపెనీకి చెందిన పాపులర్‌ కారు గ్రాండ్‌ ఐ10 గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో కేవలం 2 స్టార్‌ రేటింగ్‌ మాత్రమే పొందింది. పెద్దలు, పిల్లల సెఫ్టీలో ఈ కారు అతి పేలవమైన రేటింగ్‌ కలిగి ఉంది. ఈ కారు బాడీ నిర్మాణం స్థిరంగాలేదని గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ పేర్కొంది. ఇదే కంపెనీకి చెందిన మరో పాపులర్‌ కారు హ్యుండాయ్‌ క్రిటా 3 స్టార్‌ రేటింగ్‌ పొందింది.

కియా ఇండియాకు చెందిన అత్యధికంగా అమ్మకాలు జరుపుతున్న సెల్టాస్‌ కూడా గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో కేవలం 3 స్టార్‌ రేటింగ్‌ మాత్రమే పొందింది. పెద్దల అక్వుపెన్సీలో 8.03 పాయింట్లు, పిల్లల విభాగంలో 15 పాయింట్లు మాత్రమె తెచ్చుకుంది.
మరో కంపెనీ రెనాల్డ్‌కు చెందిన ఎంట్రీ లెవల్‌ కారు క్విడ్‌ కూడా కేవలం 1 స్టార్‌ రేటింగ్‌ మాత్రమే పొందింది. కారు ధర అందుబాటులో ఉండటంలో చిన్న కార్ల విభాగంలో ఇది బాగా పాపులర్‌ అయ్యింది.

పెద్దలు, పిల్లల విభాగంలో ఈ కారు కేవలం 1 స్టార్‌ రేటింగ్‌కే పరిమితమైంది. మంచి రేటింగ్‌ పొందిన వాటిలో టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్‌ ముందు వరసలో ఉంది. ఈ కారు 5 స్టార్‌ రేటింగ్‌ పొందింది. టాటాకే చెందిన ఆల్ట్రోజ్‌ , పంచ్‌ కూడా 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. వోక్సోవ్యాగన్‌కు చెందిన వర్చుస్‌ గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement