Wednesday, November 20, 2024

Corona Count – కాటేస్తున్న క‌రోనా.. కొత్త‌గా 700 కేసులు న‌మోదు.. నిన్న ఒక్కరోజు 921 మంది డిశ్చార్జ్‌

దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా వరుసగా రెండో రోజు దేశంలో రోజూవారీ కేసులు 700కు పైనే నమోదయ్యాయి. మొన్న (గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ) 761 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 24 గంటల వ్యవధిలో (శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ) 774 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

గుజ‌రాత్‌, త‌మిళ‌నాడులో మ‌ర‌ణాలు..
తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,187గా ఉంది. నిన్న ఒక్కరోజే 921 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,79,804కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఒకరు, తమిళనాడులో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ మృతుల సంఖ్య 5,33,387కి చేరింది.

క‌ర్నాట‌క‌లో పెరిగిన కేసులు..
ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,81,345) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) కేసులు 619 నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 110 వెలుగుచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement