- స్పీడ్ బ్రేకర్ వద్ద నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
- దీంతో కాలువలోకి దూసుకెళ్లిన కారు
- స్పాట్ లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
పట్నా – బిహార్లో ఇవాళ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.. వివరాలలోకి వెళితే… ఒకే కుటుంబానికి చెందిన కొందరు కారులో ఓ వివాహా వేడుకకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్లో పడిపోయింది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. బిహార్లోని అర్వార్ జిల్లాలో నేటి తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా… ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.