గుమ్మడిదల, జనవరి 3 (ఆంధ్రప్రభ) : గుమ్మడిదల శివారులోని నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది.
ఈప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందజేసి గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుమ్మడిదల పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతులు కాలేజీ విద్యార్ధి ఐశ్వర్య, ప్రభుత్వ అధికారి మనిషా, మరో వ్యక్తి పాసింజర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -