Friday, November 22, 2024

రూ.3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? : రేవంత్ రెడ్డి

తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. రూ.3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజక వర్గం పరిధిలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. హర్యానా మాదిరిగా ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని అన్నారు. ఆత్మ గౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని అన్నారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత.. 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు ఇప్పుడు ఎక్కడికి పోయారన్నారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. మా ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే… తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందన్నారు. 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement