Thursday, December 12, 2024

TG | విగ్రహావిష్కరణకు రాలేను : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ప్రారంభోత్సవానికి తాను రాలేక‌పోతున్నాన‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యం వ‌ద్ద తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఆహ్వానించారు.

ముంద‌స్తు కార్య‌క్ర‌మాలు ఉన్నందున‌…

త‌న‌కు ముంద‌స్తు కార్య‌క్ర‌మాలు ఉన్నందున ఈ నెల 9న జ‌రిగే తెలంగాణ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాలేక‌పోతున్నాన‌ని కిష‌న్‌రెడ్డి తెలిపారు. ప్ర‌ధానంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు లేఖ రాశారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement