Friday, November 22, 2024

National : ఈడీ విచారణకు రాలేను.. కేజ్రీవాల్ విజ్ఞ‌ప్తి….

ఈడీ విచార‌ణ‌కు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. గ‌త ఆరుసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకావాలని స‌మ‌న్లు అందించిన దానిని కేజ్రీవాల్ తిర‌స్క‌రిస్తూనే వ‌చ్చారు. తాజాగా ఏడోసారి కూడా విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ సమ‌న్లు పంప‌గా… కేజ్రీవాల్ ఈసారి కూడా తాను రాలేన‌ని చెప్పేశారు.

కాగా, ఆయన ఇలా విచారణకు ఉమ్మా కొట్టడం ఇది ఏడోసారి. అయితే, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇక, మార్చి 16న విచారణ కొనసాగుతుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. దర్యాప్తు సంస్థ న్యాయ ప్రక్రియను గౌరవించాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదు.. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలని తెలిపింది.

- Advertisement -

ఇక, మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం జారీ చేసిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అటెండ్ అయ్యారు. అయితే, కేజ్రీవాల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారణ చేసింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు ఇస్తున్నారు. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైలులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement