యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ యాసంగిలో వరి కొనేదే లేదని మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగిలో వరి కొనుగోలు చేసేది లేదని.. సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొనుగోళ్లపై కేంద్రం తీరును రైతులకు వివరించాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశంలోనే ఎక్కడా లేవని… రాబోయే వానాకాలం పంట పై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వాన కాలంలో పత్తి, వరి కొన్నిసార్లు పై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital