భారత్, చైనాలకు ఇస్తున్నట్లే తమకు కూడా 30 -40 శాతం రాయితీతో చమురు సరఫరా చేయాలన్న పాకిస్తాన్ అభ్యర్థనను రష్యా సున్నితంగా తిరస్కరించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యా వెళ్లి మాస్కోలోని తమ రాయబార కార్యాలయ అధికారులతో కలిసి రష్యన్ అధికారులతో చర్చించారు. అయితే, పాక్ అభ్యర్థనను రష్యా తిరస్కరించింది. దీంతో పాక్ మంత్రి, ఆయన బృందం ఉసూరుమంటూ స్వదేశానికి వచ్చేశారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈయూ దేశాలతోపాటు ఇతర పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాయి. దీంతో సహజ మిత్రదేశమైన భారత్‌కు డిస్కౌంట్‌పై ముడిచమురును అందించడానికి రష్యా ముందుకువచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
- Advertisement -