Saturday, November 23, 2024

కేన్స్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ, 600 కోట్ల సేకరణే లక్ష్యం..

స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల సందడి ప్రారంభమైంది. సూచీల పతనానికి కళ్లెం పడటంతో.. వివిధ కంపెనీలు ఐపీఓలుగా వచ్చేందుకు సెబీ తలుపులు తడుతున్నాయి. కేన్స్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓగా లిస్టు అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రక్షణ, వైమానిక, వైద్యం, రైల్వే సహా పలు రంగాలకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను కేన్స్‌ టెక్నాలజీస్‌ అందిస్తుంటుంది. రూ.650 కోట్లు విలువైన షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఐపీఓకు సంబంధించిన అన్ని పత్రాలు.. శనివారం సెబీకి అందజేసింది. అలాగే మరో 7.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అర్హత గల ఉద్యోగులకు 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా ప్రత్యేకంగా రిజర్వ్‌ చేసినట్టు సెబీకి వివరించింది.

రూ.420కోట్ల ఆదాయం..

కేన్స్‌ టెక్నాలజీస్‌కు కర్నాటక, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడుతో పాటు ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మొత్తం 8 తయారీ సెంటర్లు ఉన్నాయి. డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌లు కేన్స్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లు వ్యవహరించనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సదరు కంపెనీ.. రూ.420.63 కోట్ల ఆదాయాన్ని గడించింది. నికర లాభాలు రూ.9.73 కోట్లుగా రికార్డయ్యింది. రక్షణ, వైమానిక, వైద్యం, రైల్వే, అణు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఐటీతో పాలు పలు కంపెనీలకు కేన్స్‌ టెక్నాలజీస్‌ సేవలు అందిస్తూ ఉంటుంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కొంత మొత్తాన్ని రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్టు తెలిపింది. మరికొన్ని నిధులు మైసూర్‌, మానేసర్‌లోని తయారీ కేంద్రాలకు మూల ధనాన్ని సమకూర్చనున్నారు. కర్నాటకలోని చామరాజ్‌నగర్‌లో కేన్స్‌ మరో ఉత్పత్త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్టు తెలిపింది. మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించేందుకు నిర్ణయించినట్టు సెబీకి సమర్పించిన పత్రాల్లో వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement