Friday, November 1, 2024

గంజాయి సాగు థాయిలాండ్‌లో చట్టబద్ధం.. ఆహార పదార్థాల్లో, మెడిసిన్​లో వాడొచ్చు

గంజాయి సాగు, వినియోగాలను చట్టబద్ధం చేస్తున్నట్టు థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మనదేశంలోగంజాయి సాగు, వినియోగం రెండూ కూడా నిషేధమే. ఇంకా పెక్కు దేశాల్లోనిషేధం అమలులోఉంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి వినియోగాన్నీ, మోతాదుకి మించి గంజాయిని సేవించడంపై నిషేధం కొనసాగుతుందని థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గంజాయి మొక్కలనూ,పువ్వులనూ నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేటగిరి నుంచి తొలగి స్తున్నట్టు థాయిలాండ్‌ ఆహార,ఔషధ నియంత్రణ శాఖ ప్రకటించింది. ఇకపై గంజాయిని ఆహార పదార్ధాల్లో, ఔషధాల్లో వినియోగించుకోవచ్చు. వైద్య పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

గంజాయి సాగుతో దేశానికీ, రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని భావిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే మూడు నెలల జైలు, 786 డాలర్ల జరిమానా విధిస్తారు. గంజాయి సాగును చట్టబద్దం చేయడంతో ఈ చర్య వల్ల జైలుకి వెళ్ళిన నాలుగువేల మందిని త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటిచింది. అయితే, కార్పొరేట్‌ రైతులకే దీని వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుం దనీ, చిన్నరైతులకు పెద్దగా కలిసిరాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement