ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థికి తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు ఉందని పేర్కొంది. అభ్యర్థులు తమ ప్రతి ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడం ఓటర్లకు కచ్చితమైన హక్కు కాదని పేర్కొంది. అభ్యర్థికి చాలా విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే తప్ప, అతని కుటుంబ సభ్యుల వారసత్వ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement