Tuesday, November 19, 2024

కేన్స‌ర్ వైద్య‌నిపుణుడు నోరి దత్తాత్రేయుడుకి.. శివానంద ఎమినెంట్ సిటిజెన్ అవార్డు ప్రదానం

కేన్సర్ బారిన పడిన వేలాది మంది సామాన్యుల నుండి దేశాధి నేతలు, సినీ , క్రీడా, రాజకీయ ప్రముఖుల వరకు మేలైన వైద్యం అందిస్తూ ఐదు దశాబ్దాలుగా అకుంఠిత కృషిచేస్తూ విశ్వ ఖ్యాతి గడించిన ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ గ్ర‌హీత‌.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి శివానంద ఎమినెంట్ సిటిజెన్ అవార్డు ప్రదానం చేశారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి 28వ వార్షిక “శివానంద ఎమినెంట్ సిటిజెన్ అవార్డు 2021” ని బుధ‌వారం సికింద్రాబాద్ టివోలి గార్డెన్స్ లో జరిగిన వేడుకలో ప్రదానం చేశారు. కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డు సత్కారాన్ని డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ప్రదానం చేశారు. అవార్డుతో పాటు శాలువా, జ్ఞాపిక , ప్రశంసాపత్రం, నగదు బహుమతిని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అందించారు.

అవార్డు గ్రహీత ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయ మాట్లాడుతూ, శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తెలుగు గడ్డ పై పుట్టి అమెరికాలో స్థిర పడినా తరచుగా మనదేశం వస్తూనే ఉంటున్నానని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాన్సర్ చికిత్సకు వైద్య సలహా దారుడిగా సేవలు అందిస్తున్నా నని, శివానంద మూర్తి గురువుగారి తో తనకు ఉన్న పరిచయం,ఇన్నేళ్ల తన వైద్య వృత్తిలో ఎదుర్కొన్న సవాళ్ళను,ఐదు దశాబ్దాల అనుభవం అందరితో పంచుకున్నారు డాక్టర్ నోరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement