భారీఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 1200 మంది పోలీసుల నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పటికే ప్రకటించిన మెరిట్ జాబితాను రద్దు చేస్తున్నట్లు లెప్టినెంట్ జనరల్ ప్రకటించారు. 2019లో 370 అధికరం రద్దు చేసిన తరువాత నిర్వహించిన మెగా పోలీస్ డ్రైవ్ ఇప్పుడు నిలిచిపోయినట్టయ్యింది. పోలీసు నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని, ఆ ప్రక్రియను రద్దుచేయాలంటూ వేలాదిమంది రోడ్డెక్కి నిరసనలు తెలిపిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. పోలీసు నియామక వ్యవహారంలో అక్ర మాలపై దర్యాప్తునకు ఆర్ కే గోయల్ సారథ్యంలో ఒక కమిటీని నియమించిన ఆయన నివేదిక అందగానే అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జమ్మూకాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాల వ్యవహారంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, మెరిట్ జాబితా తయారీలో తిమ్మిని బమ్మిని చేశారని దర్యాప్తు బృందం నివేదించింది. దాంతో ఈ మెరిట్ జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పోలీసు నియామకాలపై త్వరలో మళ్లిd ప్రకటన జారీ చేస్తామని స్పష్టం చేశారు. 1200 మంది ఎస్‌ఐలు, పోలీసుల నియామకానికి దరఖాస్తులు కోరగా 97వేలమంది పరీక్షలు రాశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.