2010 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సర్వే చేపట్టకుండా మమతా బెనర్జీ 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని, ఆపై బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్‌ను కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంక్‌కు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని చెప్పారు. ఈ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
Amit Shah | ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు.. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : అమిత్ షా
Advertisement
తాజా వార్తలు
Advertisement