నీట్‌లో అత్యధిక ర్యాంకు వచ్చిన అభ్యర్థులు రాష్ట్ర కోటా లో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉన్నా మేనేజ్‌మెంట్ కోటాలో సీటుకు అప్లై చేస్తున్నారని, అయితే అలాంటి వారంతా ఎగ్జిట్ డేట్‌కు ముందే రద్దు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. లేనిపక్షంలో సీటు బ్లాకింగ్ కు పాల్పడినట్లుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
సీటు బ్లాకింగ్‌కు పాల్పడిన వారి వివరాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు స్పష్టం చేసింది. సీటు బ్లాకింగ్ నేరమని సుప్రీం కోర్టు , మెడికల్ కమిషన్ నిబంధనలు చెబుతున్నాయని స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్ కోటాలో సీటును రద్దు చేసుకునేవారు ఎగ్జిట్ తేదీలోగా యూనివర్సిటీ మెయిల్‌కు వివరాలు పంపాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..