Thursday, November 21, 2024

కెనరా బ్యాంకు, క్యు4 లాభం 5,678కోట్లు.. 122 శాతం వృద్ధి..

ప్ర‌భ‌న్యూస్ : కెనరా బ్యాంకు 202-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్యు4 ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. క్యు4లో భారీ నికర లాభాన్ని నమోదు చేసుకుంది. 122 శాతంతో రూ.5678 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అదేవిధంగా ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ కూడా 17.27 శాతం పెరిగి.. రూ.23,090 కోట్లకు చేరుకుందని బ్యాంకు ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయంలో కూడా వృద్ధి నమోదైంది. 9.46 శాతం పెరిగి.. రూ.26,384కోట్లకు చేరుకుంది. కాసా డిపాజిట్‌ 11.52 శాతం పెరిగింది. నికర ఎన్‌పీఏ 2.65 శాతంగా ఉంది. 117 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. గ్రాస్‌ ఎన్‌పీఏ 7.51 శాతంగా ఉంది. 142 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. అదేవిధంగా బ్యాంకు డివిడెంట్‌ను ప్రకటించింది.

ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.6.50 డివిడెంట్‌ ఇస్తున్నట్టు వివరించింది. బోర్డు డైరెక్టర్లు కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు ప్రకటించింది. గతేడాది.. నికర లాభం 64.90 శాతం పెరిగి.. రూ.1,666 కోట్లుగా ఉండింది. 2022, మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా కెనరా బ్యాంకుకు 9734 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 3042 బ్రాంచీలు, సెమీ అర్బన్‌ ఏరియాల్లో 2757, అర్బన్‌ ప్రాంతంలో 1978, మెట్రో నగరాల్లో 1957 బ్రాంచీలు ఉన్నాయి. 10,817 ఏటీఎంలు, 1391 రీ సైక్లర్స్‌ ఉన్నాయి. కెనరా బ్యాంకును అమ్మెమ్‌బల్‌ సుబ్బారావు, 1906 జులైలో స్థాపించారు. కర్నాటకలోని మంగళూరులో ఓ చిన్న బ్రాంచీతో ప్రారంభమై.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది బ్రాంచీలతో సేవలు అందిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement