Wednesday, January 8, 2025

Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా!

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దాదాపు దశాబ్ద కాలం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిస్‌ ట్రూడో.. రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ట్రూడో వైదొలగాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ మేరకు లిబరల్ పార్టీ నాయకత్వానికి, ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని పార్టీకి, గవర్నర్ కు తెలియజేశారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత తప్పుకుంటానని ట్రూడో తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగించడానికి మార్చి 24 వరకు పార్లమెంటును వాయిదా వేస్తున్నానని జస్టిస్‌ ట్రూడో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement