భారత్‌లో తన దౌత్యవేత్తలను ఆగ్నేయాసియా దేశాలకు కెనడా తరలించింది. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల సంఖ్యలో సమతూకం పాటించేందుకు భారత్‌లో ఉంటున్న 62 మంది దౌత్యవేత్తల్లో 41 మందిని అక్టోబర్ 10నాటికి ఉపసంహరించాల్సిందిగా కెనడాను భారత ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యధిక దౌత్యవేత్తలను మలేషియాలోని కౌలాలంపూర్ లేదా సింగపూర్‌కు కెనడా తరలించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే దౌత్యవేత్తల తగ్గింపు అంశంపై భారత్‌తో తాము దౌత్యపరంగా వ్యవహరిస్తున్నట్టు కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలనీ జోలి తెలిపారు. భారత్‌లో కెనడా తరఫున 60 మందికి పైగా దౌత్యవేత్తలు నియమితులైనారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement