Wednesday, November 20, 2024

BWF | కెనడా ఓపెన్ ప్రారంభం.. సింధూ గెలుపుపై అభిమానుల ఆసక్తి!

బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ (BWF) సూపర్ 500 కెనడా ఓపెన్ ఇవ్వాల (జులై 4న) రాత్రి 10 గంటలకు కెనడాలో ప్రారంభం కానుంది. 9వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ పోటీల్లో డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. వ‌ర‌ల్డ్ 61వ ర్యాంక్‌లో ఉన్న స్థానిక హోప్‌ తలియాపై తొలి పోరాటం చేయనుంది. ఈ ఈవెంట్ రేస్ టు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ సైకిల్‌లో ఒక‌ భాగంగా ఉండనుంది. దీంతో సింధు ఈ సీజన్‌లో తన మొదటి టైటిల్‌ను గెలుచుకుని టేబుల్‌పై తన ప్లేస్ను మెరుగు పరుచుకోవాలని చూస్తోంది.

అలాగే మహిళల సింగిల్స్ లో తస్నిమ్ మీర్, గద్దె రుత్విక శివాని భారత్‌ తరపున రంగంలోకి దిగ‌నున్నారు. ఇందులో తస్నిమ్ వియత్నాంకు చెందిన థుయ్ లిన్గుయెన్తో ఆడునుండ‌గా.. రుత్విక శివాని థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్‌తో తలపడనుంది.

ఇక‌.. పురుషుల సింగిల్స్ లో భారత్ సవాల్‌కు లక్ష్య సేన్ నాయకత్వం వహించనున్నారు. కెనడా ఓపెన్‌ మాజీ చాంపియన్‌ బి.సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, శంకర్‌ ముత్తుసామి లాంటి దిగ్గజాలు క్వాలిఫయర్స్ లో బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉండ‌గా.. పురుషుల డబుల్స్ లో కృష్ణ ప్రసాద్ గరగ, విష్ణువర్ధన్ గౌడ్ పంజాల జోడీ భారత్ త‌ర‌పున ఆడ‌నున్న ఏకైక జోడీ. వీరిద్దరు ఓపెనర్‌లో ఫ్రెంచ్ జోడీ జూలియన్ మైయో, విలియం విల్లెగర్‌తో ఆడనున్నారు.

  • ‌కెనడా ఓపెన్ 2023 కెనడాలోని కాల్గరీలోని మార్కిన్-మాక్‌ఫైల్ సెంటర్‌లో జరుగుతుంది.
  • కెనడా ఓపెన్ 2023 జులై 6వ తేదీ నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
  • భార‌త దేశం లో కెనడా ఓపెన్ 2023 ప్రత్యక్ష ప్రసారం Jio సినిమా, BWF TV YouTube చానెల్‌లో చూడొచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement