Tuesday, November 26, 2024

Omicron: RT-PCR పరీక్షలు ఓమిక్రాన్ ని గుర్తించగలవా?

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలకు టెన్షన్ పెడుతోంది. కరోనా అన్ని వేరయింట్ల కంటే.. ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది.

‘ఒమిక్రాన్’ వేరియంట్ టెస్టుల్లో దొరకదన్న ప్రచారాన్ని కేంద్రం కొట్టివేసింది. RTPCR, ర్యాపిడ్ పరీక్షల్లో ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. ఈ పరీక్షల నుంచి అది ఎంతమాత్రమూ తప్పించుకోలేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌కు సంబంధించి దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఉండాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital



Advertisement

తాజా వార్తలు

Advertisement