లష్కర్ బోనాలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఇవ్వాల (శుక్రవారం) సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ నెల 9వ తేదీన జరిగే బోనాల వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తోలిబోనం సమర్పించనున్నారు.
బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా బోనాలను ప్రకటించారని డిప్యూటీ స్పీకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని పద్మారావుగౌడ్ అన్నారు.