ఎయిర్ ఇండియా సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కాంప్‌బెల్ విల్సన్‌ను నియమించినట్లు టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. సింగపూర్‌కు చెందిన బడ్జెట్ క్యారియర్ స్కూట్ సీఈఓగా పనిచేసిన విల్సన్ ఎయిర్ ఇండియా పదవి స్వీకరించడం కోసం దానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ధృవీకరించింది. 50 ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది. గత మార్చిలో టాటా గ్రూప్ చీఫ్‌గా నియమితులైన ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ… విమానయాన రంగంలో విల్సన్ మంచి అనుభవజ్ఞుడు. పలు కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో పనిచేశారు. అనేక విధులు నిర్వహించారు. ఆయన అనుభవాలు ఎయిర్ ఇండియాకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆసియాలో ఓ ఎయిర్‌లైన్ బ్రాండ్‌ను సృష్టించిన అనుభవం ఆయనది. అయనతో కలిసిపనిచేయడానికి ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నాను’ అని ఆయన అన్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా ఒకటి. దానికి సారథ్యం వహించడం సవాల్ వంటిదే అని విల్సన్ అన్నారు. టాటా గ్రూప్‌లో ఎయిర్ ఇండియా మూడవ ఎయిర్‌లైన్ బ్రాండ్. ఎయిర్ ఏసియా ఇండియా, విస్టారాలో టాటా గ్రూప్‌కు మెజారిటీ వాటాలున్నాయి. నిజానికి విల్సన్‌కన్నా ముందు టర్కీకి చెందిన ఇల్కర్ అయెసిని నియమించాలని అనుకున్నారు. కానీ,ఈ నియామకానికి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను టాటా సన్స్ విరమించుకున్నది. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో టాటా గ్రూప్ అనుబంధ సంస్థకు రూ. 18,000 కోట్లకు కట్టబెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి