Friday, November 22, 2024

క్యాంపా కోలా మళ్లి వస్తోంది.. మొదట ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లలో విడుదల

రిలయెన్స్‌ వెంచర్స్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌) ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ విభాగం అనుబంధ సంస్థ అయిన రిలయెన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) గురవారం కొత్త జనరేషన్‌ కోసం ఐకానిక్‌ బ్రాండ్‌ కాంపాను ప్రారంభించినట్టు ప్రకటించింది. కాంపా డ్రింక్‌.. మొదట్లో క్యాంపా కోలా, క్యాంప లెమన్‌, క్యాంపా ఆరెంజ్‌ ఫ్లేవర్‌ ల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ బ్రాండ్‌ను ప్రారంభించడం అనేది స్వదేశీ భారతీయ బ్రాండ్‌లను ప్రోత్సాహించడానికి సంస్థ వ్యూహానికి అనుగుణంగా ఉందని, ఇవి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా భారతీయ వినియోగదారులతో లోతుగా, బలంగా పాతుకుపోయి అనుబంధాన్ని కలిగి ఉన్నాయని రిలయెన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

క్యాంపా రేంజ్‌ ప్రోడక్ట్స్‌లను ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మార్కెట్‌ చేసి, ఆ తర్వాత దేశమంతటా విస్తరించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారతీయ వినియోగదారుడికి సరసమైన ధరలకు, అధిక నాణ్యత ఉత్పత్తుల ద్వారా విలువ, ఎంపికను అందించాలనే తమ సంస్థ దృష్టి పెట్టిందని తెలిపింది. ఈ ప్రారంభంతో ఆర్‌సీపీఎల్‌ తన బహుముఖ ఎఫ్‌ఎంసీజీ జాబితాను మరింత బలోపేతం చేయనుంది. ఇందులో భాగంగా సోస్యో హజూరీ నుంచి హెరిటేజ్‌ బ్రాండ్‌లు, శ్రీలంకకు చెందిన ప్రముఖ బిస్కెట్‌ బ్రాండ్‌ మలిబాన్‌, లోటస్‌ చాక్లెట్‌ల నుంచి మిఠాయి శ్రేణితో పాటు ఇండిపెండెన్స్‌, గుడ్‌లైఫ్‌తో సహా దాని ఇతర సొంత బ్రాండ్‌ల కింద రోజువారీ నిత్యావసరాలు కూడా ఉన్నాయి.

క్యాంపా కోలాను దాని కొత్త అవతార్‌లో ప్రదర్శించడం ద్వారా ఈ నిజమైన ఐకానిక్‌ బ్రాండ్‌ను స్వీకరించడంతో పాటు పానియాల విభాగంలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి తరతరాలుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసికోరావాలని ఆశిస్తుందని ఆర్‌సీపీఎల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. గొప్ప వారసత్వంతో క్యాంపా సమకాలీన ఉత్పత్తి ఈ వేసవిలో వినియోగదారులకు ది గ్రేట్‌ ఇండియాన్‌ టేస్ట్‌ ను అందించడానికి సిద్దంగా ఉందని ప్రతినిధి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement