Friday, November 22, 2024

Camp Politics – హైద‌రాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు….చే జార‌కుండా కాంగ్రెస్ ఏర్పాట్లు ..

హైదరాబాద్ : జార్ఖండ్ కొత్త ముఖ్య‌మంత్రిగా చంపై సోరెన్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు… ఆయ‌న ఈ నెల అయిదో తేదిన అక్క‌డ అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొనున్నారు.. ఈ నేప‌థ్యంలో ఎఎంఎం , కాంగ్రెస్ కు చెందిన 43 మంది ఎమ్మెల్యేల‌తో చంపై క్యాంప్ రాజ‌కీయాల‌కు తెర‌తీశారు.. అధికార జెఎంఎం కూట‌మిలో కాంగ్రెస్ కూడా ఉండ‌టంతో ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్ క త‌ర‌లించారు.. ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్ పోర్టులో దిగారు. రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేట్ కు చేరుకున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వీరికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపదాస్ మున్షీ స్వాగతం పలికారు.
అనంత‌రం జార్ఖండ్ ఎమ్మెల్యేలను బేంగపేట్ నుంచి శామీర్ పేట్ లోని రిసార్ట్స్ కు తరలించారు. శామీర్ పేట్ లోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. కాగా, ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాంగ్రెస్ పార్టీ భాద్య‌త‌లు తీసుకుంది. ఈ క్యాంప్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు సిఎం గా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేయండంతో ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.. ఈ నేప‌థ్యంలో అధికార జేఎంఎం కూటమి శాసనసభా పక్ష నేత చంపై సోరేన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి గా శుక్రవారం (ఫిబ్రవరి 2) ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజభవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చంపైతో ప్రమాణం చేయించారు. చంపైతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం బలనిరూపణకు 10 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్.. అప్పటివరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. కాగా 81 మంది స‌భ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్,జెఎంఎం బ‌లం 48 గా ఉంది.. బిజెపికి 33 స‌భ్యులున్నారు… చంపై ప్ర‌భుత్వ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గాలంటే 42 మంది స‌భ్యుల బ‌లం అవ‌సరం…దీంతో ఎమ్మెల్యేలు ఏ ఒక్క‌రూ చేజార‌కుండా కాంగ్రెస్ చూస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement