Tuesday, November 26, 2024

సృహ‌త‌ప్పి ప‌డిపోయిన ఒంటె.. నీళ్లు ప‌ట్టి కాపాడిన డ్రైవ‌ర్

ఈ ఏడాది గ‌తేడాది కంటే ఎండ‌లు మండిపోతున్నాయి. మ‌నుషులే కాదు ఈ ఎండ‌ల ధాటికి మూగ‌జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ వేడిని త‌ట్టుకోలేక ఎన్నో మూగ‌జీవాలు మ‌ర‌ణిస్తున్నాయి. కాగా దాహంతో బాధపడుతున్న ఒంటె నీరు లేకపోవడంతో రోడ్డు పక్కన కదలకుండా పడిపోయింది. అయితే అప్పుడే ఒక వ్యక్తి దేవుడిలాగా వచ్చి బాటిల్ తో నీళ్ళు అందించి ఆ ఒంటెకు ప్రాణం పోశాడు. ఈ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఇలా వ్రాశారు. దాహంతో బాధపడుతున్న ఒంటె తన చివరి శ్వాసలను లెక్కిస్తోంది. కానీ అప్పుడు దయగల ఓ వ్యక్తి .. తన చేతులతో నీరందించి..ఆ జీవికి కొత్త జీవితాన్ని ఇస్తాడు. భావోద్వేగ క్లిప్‌ను చూసిన తర్వాత.. దేశం ప్రస్తుతం తీవ్రమైన వేడి వేవ్‌లో ఉందని IFS ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని నీటి చుక్కలు ఒకరి జీవితాన్ని కాపాడతాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement