Monday, November 25, 2024

Robert Vadra | ఆధ్యాత్మిక భావనలతో హైదరాబాద్ వచ్చా…

కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ భ‌ర్త రాబర్ట్ వాద్రా ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆధ్యాత్మిక భావనలతోనే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయపరమైన కోణం లేదన్నారు.

కాగా, తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనుందని, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు. అయితే, దేశంలో మహిళల భద్రత పెద్ద సమస్యగా మారిందన్నారు. తన భార్య, కూతురు భద్రతపై కూడా ఆందోళనగా ఉందన్నారు. భూమిపై నడవాలంటే నా భార్య, కూతురితో సహా దేశంలోని మహిళలందరూ భద్రతగా ఫీల్ అయ్యే రోజు రావాలి. మ‌హిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పాలని రాబ‌ర్ట్ వాద్రా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement