Sunday, November 17, 2024

TG | సమగ్ర కుటుంబ సర్వే సందేహాలకు కాల్ సెంటర్ : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేపై సందేహాల నివృత్తి చేసేందుకై గాంధీభవన్‌లో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఏర్పాటు చేసిన 72890 87272 కు నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం టీపీసీసీ చీఫ్‌ బి మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ, గాంధీభవన్‌లో కాల్‌సెంటర్‌ పర్యవేక్షకుడిగా రుద్ర సంతోష్‌ను నియమించామని, ప్రతి రోజు 2 వేలమందికి పైగా ఈ మిస్డ్‌ కాల్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

రాబోయే 15 రోజుల్లో 30 వేలమంది కార్యకర్తలతో నేరుగా అనుసంధానం చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 15 వేల మందికి కులగణనపై సందేహాలను నివృత్తి చేసినట్లు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement