కోల్ కతా… జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధించాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో సుమారు 196 మంది మహిళా ఖైదీలు పిల్లలకు జన్మనిచ్చారు. వారితోపాటు వారి పిల్లలు కూడా జైల్లోనే ఉంటున్నారు. దిద్దుబాటు గృహాల్లోని పురుష సిబ్బంది మహిళా ఖైదీల ఎన్క్లోజర్లలోకి ప్రవేశించకుండా నిషేధించాలని కోర్టుకు అమికస్ క్యూరీ తెలిపింది.
వివరాలలోకి వెళితే …`పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని గురువారం కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. అంతే కాదు జైళ్లలో మహిళా ఖైదీలతో పాటు అంటే తల్లులైన ఖైదీలతో పాటు పిల్లలు కూడా జైల్లోనే నివసిస్తున్నారు. 196 మంది మహిళా ఖైదుల పిల్లలు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో ఉంటున్నారు. కరెక్షనల్ హోమ్స్ లో ఉన్న మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్‌లలోనికి పురుష ఉద్యోగులను నిషేధించాలని పిటిషన్లో కోర్టును ఆ పిల్లో కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టులో త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ అంశాన్ని 2018లో సుమోటోగా విచారణకు స్వీకరించిన కలకత్తా హైకోర్టు దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని న్యాయవాది తపస్ కుమార్ భంజాను అమికస్ క్యూరీగా నియమించింది. దీనిపై అమికస్ క్యూరీగా తపస్ కుమార్ భంజా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు తగు సూచనలతో కూడిన నోట్‌ను సమర్పించారు. జైలులోని మహిళా ఖైదీల ఎన్క్లోజర్లలోకి పురుష సిబ్బంది ప్రవేశంపై తక్షణమే నిషేధం విధించాలని ఆ నోట్లో అభ్యర్థించారు. మహిళలు ఉంటే జైలులో మహిళా సిబ్బందే ఉండాలని సూచించారు… పురుషులను ములఖత్ సమయంలో గ్రిల్ వెనుక నుంచి మాత్రమే మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు..