హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎనిమిది కేజ్ కల్చర్ చేపల పెంపకం యూనిట్లు గోదావరిలోకి కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మంచిర్యాల జిల్లాలో ని గోదావరిలో వరద నీరు ఉృధృతంగా ప్రవశిస్తుంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో బ్లూ రివెల్యూషన్ పథకం కింద ముగ్గురు ఔత్సాహిక మత్స్యకార రైతులు ఆధునిక పద్దతిలో కేజ్ కల్చర్ చేపల పెంపకాన్ని చేపట్టారు.
వర్షాల కారణంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో మత్స్యకారులు ఏర్పాటు చేసిన ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లు నదిలోకి కొట్టుకుపోయాయి. దాదాపు కోటి రూపాయల విలువైన వంద టన్నుల చేపలు, నాలుగు మోటర్ బోట్లు, ఆరు టన్నుల చేపల దాణా నీటి పాలైంది. షెడ్లు, వలలు, సేఫ్టీ జాకెట్లు సైతం కొట్టుకుపోయాయి. మొత్తం నలుగైదు కోట్ల రూపాయల మేర నష్టం జరిగివుండవచ్చని అంచనా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.