ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.