తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులోగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల ఇళ్ల దరఖాస్తులకు సర్వే పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వ పాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సంక్రాంతికి ముందే వీఆర్వో విధానాన్ని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆర్వీఆర్ చట్టంపై అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణమని విమర్శించారు.