Sunday, October 20, 2024

TG | రేవంత్ చేతికి ఉద్యోగుల బదిలీలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక సర్కార్‌కు చేరింది. ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందించింది. ఈ కార్యక్రమంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చీరాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ వివాదాస్పద జీవోపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి.. సమస్యలను నివారించడంలో అనేక చర్యలు తీసుకుంది. జీవో 317పై ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సబ్‌ కమిటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో సమావేశాలు జరిపింది. ఇంతకీ 317 జీవోపై కమిటీ ఏం తేల్చింది..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది..? నివేదికతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement