Wednesday, December 18, 2024

Cabinet Meeting | ఐదు ఆర్డినెన్స్‌లకు ఆమోదం !

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ రాష్ట్రమంత్రులు భేటి అయ్యారు. సుదీర్ఘంగా 4 గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ 5 ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపింది.

వాటిలో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం వంటి అంశాలపై మంత్రులు సుదీర్ఘ చర్చ జరిపారు. ఓఆర్ఆర్(ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement