Saturday, November 23, 2024

వాట్సప్‌ నుంచి క్యాబ్ బుకింగ్‌..

ప్ర‌భ‌న్యూస్ : ఉబర్‌లో రైడ్‌ బుకింగ్‌ మరింత సులభంగా మారింది. భారత్‌లో వాట్సప్‌ ద్వారా రైడ్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యాన్ని ఉబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరహా సర్వీస్‌ ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది. మెసేజ్‌ పంపించినంత సులువుగా రైడ్‌ను బుక్‌ చేసుకోవచ్చని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తొలుత లక్నో నగరంలో మాత్రమే ఈ నూతన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది. వాట్సప్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించాం.

ఈ భాగస్వామ్యాన్ని ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఉబర్‌ తెలిపింది. భారతీయులందరికీ ఉబర్‌ ట్రిప్‌ను వీలైనంత సులభతరం చేస్తాం. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండే ప్లాట్‌ఫామ్స్‌ పై సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. వాట్సప్‌ తమ భాగస్వామ్యంత రైడర్ల సులభతరమైన, విశ్వాసనీయమైన మార్గాల్లో సేవలు అందిస్తారని ఉబర్‌ ఏపీఏసీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ నందిని మహేశ్వరి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement