ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ‘సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్-2019’ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సీఏఏపై తన అభిప్రాయం మారబోదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఇది విభజన చట్టం అని.. ముస్లింలను రెండో తరగతికి పంపాలన్న గాడ్సే ఆలోచనలకు ఇది ప్రతిరూపమని ఆరోపించారు.
వలస వచ్చినవారికి ఆశ్రయం ఇవ్వండి కానీ మతాన్ని బట్టి పౌరసత్వాన్ని ఇవ్వొద్దు అని కోరారు. ఐదేళ్లు పెండింగ్లో ఉంచి, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. NPR, CAA అంటే ముస్లింలను టార్గెట్ చేయడమే అని అన్నారు. వీటి వ్యతిరేకులు మళ్లీ వీధుల్లోకి రాక తప్పుదు అని ఒవైసీ పేర్కొన్నారు.