Saturday, November 23, 2024

EC | ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక..

పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు గెలుపొందగా, కొందరు ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా…

పశ్చిమ బెంగాల్- 4.
హిమాచల్- 3.
ఉత్తరాఖండ్- 2.
బీహార్- 1.
తమిళనాడు- 1.
పంజాబ్- 1.
మధ్యప్రదేశ్- 1 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఈ స్థానాలకు ఉప ఎన్నికల జూన్ 14న నోటిఫికేషన్ విడుదల‌వ్వ‌గా… జూన్ 21న నామినేషన్‌కు ముగిసింది. జూన్ 24న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ జూన్ 26న పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత జూలై 10న ఓటింగ్ నిర్వహించనున్నారు. వాటి ఫలితాలు ఈ నెల 13న వెల్లడికానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement