భారత్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. రెండు వరుస గేమ్స్‌లో విజయం సాధించి.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. మలేషియా క్రీడాకారుడు డారెన్ లీవ్‌పై 21-7, 21-17 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. కేవలం 42 నిమిషాల్లోనే ఆటను ముగించేశాడు. లీవ్‌ను చిత్తుగా ఓడించాడు. స్పెయిన్‌కు చెందిన లూయిస్ ఎన్రిక్ పెనాలర్, డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ గెమ్కే మధ్య జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారితో ప్రణయ్.. ప్రీ క్వార్టర్స్ ఆడనున్నాడు. ఇప్పటికే లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌లు ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
ప్రణయ్‌కు.. లీవ్‌తో తొలి సెట్లో సల్ప ప్రతిఘటన ఎదురైంది. 8-5తో లీవ్ దూసుకెళ్లాడు. ఆ తరువాత.. ప్రణయ్ వరుసగా 8 పాయింట్లు రాబట్టడంతో.. 16-5 లీడ్లోకొచ్చాడు. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. తొలి సెట్‌ను 21-7తో ముగించాడు. రెండో గేమ్‌లో 6-6తో ఉన్న సమయంలో.. ప్రణయ్ ఒక్కసారిగా దూసుకెళ్లి 16-11తో లీడ్‌లోకి వచ్చాడు. చివరికి 21-17 పాయింట్లతో ప్రణయ్ గెలిచాడు.
మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ.. కూడా ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. చైనీస్ జోడి లి జున్ జున్, జియా యు తింగ్ని 21-11, 9-21, 21-13 పాయింట్ల తేడాతో ఓడించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, కపిల జోడి నిరాశపర్చింది. 11వ సీడ్ రష్యా జోడి వ్లాదిమిర్ ఇవానోవ్, ఇవాన్ సోజోనోవ్ చేతిలో 11-21, 16-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. 41 నిమిషాల్లో ఆట ముగిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital