ఇవ్వాల (మంగళవారం) విడుదల చేసిన తాజా BWF ప్రపంచ ర్యాంకింగ్స్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. అయితే కిదాంబి శ్రీకాంత్ 20వ స్థానానికి పడిపోయాడు. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ వరుసగా ప్రపంచ నంబర్ 9, 11లో స్థిరంగా ఉన్నారు.
గత వారం సిడ్నీలో జరిగిన సూపర్ 500 టోర్నమెంట్‌లో తన తొలి సెమీఫైనల్ ముగింపు తర్వాత., రజావత్ మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ 28వ ర్యాంక్‌కు చేరుకోగా, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ వరుసగా ఏడు, ఆరు స్థానాలు ఎగబాకి 43, 49వ స్థానాల్లో నిలిచారు.
ఇక పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి ప్రపంచ నంబర్ 2లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన భారతీయులు. మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లు రెండు స్థానాలు కోల్పోయి 19వ స్థానానికి పడిపోయారు.