ఎన్ ఎల్ వీ సూర్య ప్రకాశ్ తెరకెక్కిస్తోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. ఈ మూవీ టీజర్ ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రని పోషిస్తోంది. నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రెస్ట్రిక్షన్స్ అని హెబ్బా వాయిస్ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్ తో స్టార్ట్ అయింది ఈ మూవీ టీజర్. సిగరెట్ తాగుతున్న హెబ్బా పటేల్ తన చేతి వేలుకి రక్తం చూసి షాకవుతుంది. ఆ తర్వాత మీ స్వేచ్చను వేడుక చేసుకోండి..అంటోంది. టీజర్ మధ్యలో రెండు షేడ్స్ ఉన్న లుక్‌లో కనిపిస్తోంది హెబ్బా పటేల్. హీరోహీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మధ్య ఏదో సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్నట్టు హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకీ హీరోహీరోయిన్ల మధ్య ఏం జరిగింది. అనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి.. ఆసక్తిని పెంచుతోంది. మేఘనా రెడ్డి సమర్పణలో ఎస్‌ఆర్ ఆర్ట్స్/ఏయూ, ఐ స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంలో పద్మనాభరెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement