కటక్ – ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టి మరీ టమాటాలు కొనుగోలు చేసిన షాకింగ్ ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది వివరాలలోకి వెళితే కటక్ నగరంలో శనివారం ఓ వ్యక్తి వాషింగ్ మెషీన్ కొనుగోలు చేశానని.. దాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కూలీలు కావాలని రూ.300లు ఇస్తానని చెప్పి ఇద్దరు పిల్లలను (మైనర్లు)తీసుకువెళ్లాడు. అది నమ్మిన ఆ ఇద్దరు పిల్లలు అతని కూడా వెళ్లారు. సదరు వ్యక్తి దారి మధ్యలో ఛట్రా బజార్‌లో కూరగాయల దుకాణానికి వెళ్లాడు. 4 కిలోల టమాటాలు కొన్నాడు.
తరువాత మరో 10కిలోలు కావాలని కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదని..చెప్పాడు. ఆ మాటలు కూరగాయల వ్యాపారి నమ్మాడు. మరో ఈ నాలుగు కిలోలతో. పాటు మరో 10కిలోల టమాటాలకు కలిపి డబ్బులు ఒకేసారి ఇస్తానని చెప్పాడు. ముందుగా కొన్న 4 కిలోల టమాటాలు ఇంటి వద్ద ఇచ్చి మొత్త డబ్బులు తీసుకువస్తానని చెప్పాడు. కానీ మొదట్లో సదరు వ్యక్తి నమ్మిన కూరగాయల వ్యాపారి మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తానని చెప్పిన మాటలు నమ్మలేదు.
అలా అయితే నా పిల్లలను నీవద్దే ఉంచుతాను..డబ్బులు ఇచ్చి తీసుకెళతాను నమ్మకమేనా కదా..అంటూ కూలి ఇస్తాయని చెప్పి తీసుకొచ్చిన ఇద్దరు పిల్లలను అక్కడే ఉంచుతానని కూరగాయల దుకాణం యజమానికి చెప్పాడు. ఆ ఇద్దరు పిల్లలు అతని పిల్లలే అని నమ్మిన వ్యాపారి సరేనన్నాడు.
దీంతో టమాటాలు పట్టుకుని వెళ్లిపోయాడు. కానీ వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీంతో 2 గంటల తర్వాత అనుమానం వచ్చింది వ్యాపారికి. ఆ ఇద్దరు పిల్లలను మీ నాన్న ఇంకా రాలేదేంటీ? అని ప్రశ్నించాడు. దీంతో పిల్లలు ఇద్దరు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అతను మా నాన్న కాదు అతను ఎవరో కూడా మాకు తెలియదు…పని ఉంది కూలి ఇస్తాను రమ్మంటే వచ్చామని చెప్పారు. దీంతో కూరగాయల వ్యాపారి షాక్ అయ్యాడు. అతను ఎక్కడుంటాడో తెలుసా? అని అడిగాడు.దానికి వారు ఏమో తెలియదు అతనికి మొదటిసారే చూశాం..వాషింగ్ మిషన్ కొన్నాను కూలికి రమ్మంటే వచ్చామని చెప్పారు. అంతే తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు