ప్రభన్యూస్ : కటింగ్ లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మిల్లర్ లను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు అతి తక్కువ స్థాయిలో వరిధాన్యం కొనుగోలు జరిగిందని, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిబంధనల మేరకు తేమశాతం పాటిస్తూ, తాలు తీసేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపినా కూడా వివిధ అభ్యంతరాలు తెలుపుతూ మిల్లర్లు వరిధాన్యాన్ని తీసుకోవడం లేదనే కంప్లైంట్స్ వస్తున్నాయని, రైతుల నుండి కంప్లైంట్స్ రాకుండా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన వరి ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని ఆదేశించారు.
మిల్లర్లు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల మధ్య ఉన్న గందరగోళాన్ని సరిచేసేందుకు రేపు మంగళవారం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, మిల్లర్లు, పిఎసిఎస్ చైర్మన్ లు మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరాలసంస్థ మేనేజర్ రాఘవేందర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కోరే రమేష్, పౌరసరఫరాలశాఖ అధికారులు మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital