సితార ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వస్తున్న చిత్రం ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రధారులు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్.
మీె సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. నాకు ముందు నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. తొలు త రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ముంబైలో ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగా రు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. కొంతకా లానికి ఒక స్నేహితుడి ద్వారా సుకుమార్ గారు పరిచ యమయ్యారు. ఆయన దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను.
సినిమాల్లోకి రాడానికి స్ఫూర్తి ఎవరు?
చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. మా నాన్నగారు ప్రతివారం ఏదో ఒక సినిమాకి తీసు కెళ్లేవారు. అలా చిన్నతనం నుంచే సినిమాల మీద ఇష్టం మొదలైంది. ఆయన పేరు చంద్రశేఖర్ ను నా పేరులో పెట్టు-కున్నాను. ఆ పేరుని తెర మీద చూడా లనేది నా కోరిక.
బుట్టబొమ్మ ఎలా మొదలైంది?
లాక్ డౌన్ సమయంలో కప్పేల చిత్రాన్ని చూశా ను. కథనం పరంగా చాలా నచ్చింది. కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్ని చిత్రాలు చేయలేము. ఇది పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లు-గా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటు-ందనే నమ్మకం కలిగింది.
మొదటి సినిమానే రీమేక్ ఎంచుకున్నారు?
కథలో ఉన్న బలం. కథనం నన్ను బాగా ఆకట్టు-కుంది. మలయాళ సినిమాలు అయ్యప్పనుమ్ కోషియం, కప్పేల ఈ రెండు చూసినప్పుడు తెలుగు లో చేస్తే బాగుంటు-ంది అనిపించింది. అప్పటికే ఆ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకొని, అయ్య ప్పనుమ్ కోషియం రీమేక్‌ను సాగర్ చంద్రతో ప్రకటించారు. కప్పేల రీమేక్ చేయబోతున్నారని తెలి సి, నేనే వారిని సంప్రదించాను. ఎడిటర్ నవీన్ నూలి గారి ద్వారా చినబాబు గారిని, వంశీ గారిని కలిశాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.
నటీ-నటు-ల ఎంపిక ఎలా జరిగింది?
హీరోయిన్ పాత్ర చాలా అమాయకంగా, పల్లె టూరి అమ్మాయిలా ఉండాలి. గౌతమ్ మీనన్ గారి క్వీన్ వెబ్ సిరీస్ లో అనిఖా సురేంద్రన్‌ను చూసిన ప్పుడు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అర్జున్ దాస్ ఎంపిక మాత్రం వంశీ గారి సూచన
మేరకు జరిగింది. సూర్య పేరును చినబాబు గారు, వంశీ గారు ఇద్దరూ సూచించారు. ఆడిషన్ చేశాక ఆ పాత్రకు సరిపోతాడు అనిపించి ఎంపిక చేశాం
తెెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?
మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీ-కి తగ్గట్లు- చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ప్రధమార్థంలో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లు-గా మార్పులు చేశాం.