టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ స్కోరు బోర్డుపై డిఫెండబుల్ టార్గెట్ ను సెట్ చేసింది. చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్న భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదురుకుంటూ… స్కోర్ బోర్డు పై పరుగువ వరద పారించింది.
అయితే, ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్లిద్దరూ పిలిప్ సాల్ట్ (4), బెన్ డకెట్ (3) పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (13) పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ (45) విజృంభించాడు.
ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్ తో జామీ స్మిత్ (22), బ్రైడన్ కార్సే (31) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
ఇక టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ (1/40), హార్దిక్ పాండ్యా (1/6), వాషింగ్టన్ సుందర్ (1/9), అభిషేక్ శర్మ (1/12), అక్షర్ పటేల్ (2/32), వరుణ్ చక్రవర్తి (2/38) వికెట్లు తీశాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ సేన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.