Monday, November 25, 2024

Business: వరుసగా మూడో రోజూ నష్టాలే.. 372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్లు వరసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం నాడు మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు లాభాల్లోనే ఉన్న మార్కెట్లు తరువాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు దిగువకు రావడంతో ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. రూపాయి మరింత బలహీనపడటం, బొగ్గుదిగుమతుల పెరుగుదల, రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బీఎస్‌సీ సెన్సెక్స్‌ 372.46 పాయింట్లు నష్టపోయి 53514 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.65 పాయింట్లు నష్టపోయి 15966.65 వద్ద ముగిసింది. బంగాకం 10 గ్రాముల ధర 196 రూపాయలు తగ్గి 50261 వద్ద ట్రేడ్‌ అయ్యింది. వెండి కిలో 37 రూపాయలు తగ్గి 56429 వద్ద ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.27గా ఉంది.

లాభపడిన షేర్లు
హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఏషియన్‌ పేయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా షేర్లు ఉన్నాయి.

నష్టపోయిన షేర్లు
టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండ్రస్టీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అపోలో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement