Friday, November 22, 2024

Business: 5జీ రేసులో అదానీ, ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ డెటా ఎంటర్‌ప్రజెస్‌ పాల్గొంటున్నట్లు టెలికం విభాగం (డాట్‌) అధికారికంగా వెల్లడించింది. ఇందులో అదానీతో పాటు ముఖేష్‌ అంబానీకి చెందిన జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు పాల్గొంటన్నాయి. అదానీ కంపెనీ యూనిఫైడ్‌ లైసెన్స్‌ను ఐఎల్‌డి ( జాతీయ ప్రాంతం) ఎస్‌ఎల్‌డీ( జాతీయ ప్రాంతం)తో పాటు గుజరాత్‌ సర్కిల్‌కు ఐఎస్పి-బితో పొందేందుకు టెలికం విభాగం అంగీకారపత్రం జారీ చేసింది. అదానీ ఎంటర్‌ప్రజెస్‌ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌ ద్వారా 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసింది.

ఈ నెల 26న ప్రారంభం కానున్న స్పెక్ట్రమ్‌ వేలంలో కొన్ని ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లకు తీవ్ర పోటీ జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా తమ స్థానాలను కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నించనున్నాయి. వేలంలో 600 మెగాహెర్జ్‌, 700, 800, 900,1800,2100, 2300,2500,3300 మెగాహెర్జ్‌, 26 గిగాహెర్జ్‌ బ్యండ్‌లను వేలం వేయనున్నారు. ఈ వేలంలో 4.3 లక్షల కోట్ల విలువైన 72097.85 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలానికి వస్తుంది. పోటీలో ఉన్న కంపెనీలు తమ దరఖాస్తును ఈ నెల 19లోగా ఉపసంహరించుకోవ చ్చు. పోటీదారుల తుది జాబితాను ఈ నెల 20న అధికారికంగా ప్రకటిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement