రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని యుూపీ ప్రభుత్వం మహిళలకు యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. . మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
ఇది కూడా చదవండి: మీడియాపై సీజేఐ రమణ అసహనం