Tuesday, November 26, 2024

జాబ్‌ పేరుతో బురిడీ.. మోసపోయిన నిరుద్యోగ యువత..

నిరుద్యోగుల ఆశ‌ను పెట్ట‌బ‌డిగా చేసుకొని కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మాజంలో ఇలాంటి సంఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని ర‌కాలుగా అవగాహ‌న క‌లిపిస్తున్నా నిరుద్యోగులు మోస‌పోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట డ‌బ్బులు వ‌సూలు చేస్తూనే ఉన్నారు. ఆలస్యంగా ఇలాంటి ఘ‌ట‌నే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి
ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు నమ్మించి నిరుద్యోగుల‌కు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని ఆశ చూపించారు. ఇలా నిరుద్యోగులు ఒక్కొక్క‌రి నుంచి లక్షల రూపాయలు వ‌సూలు చేశారు. పాలకుర్తి, బసంత్ నగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ కు చెందిన నిరుద్యోగుల‌తో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు డ‌బ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఇదిగో ఉద్యోగం, అదిగో ఉద్యోగం అంటూ న‌మ్మ‌బలికిన ఆ యువతి డ‌బ్బులు చేతుల్లోకి రాగానే రేపు మాపు అంటూ మూడు సంవత్సరాలుగా తన చుట్టూ తింపుకుంది. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

నమ్మించి మోసం…
2020 ఫిబ్రవరి నెలలో ఈ మోసానికి తెర తీసింది. నిరుద్యోగులతో పాటు పోలీసు, ఆర్మీ అధికారుల పిల్లలు కూడా ఆ యువతి చేతిలో మోస పోయినట్లు తెలుస్తోంది. నమ్మకం కలిగేలా తీసుకున్న డబ్బులకు ప్రామిసరి నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చి హ్యాండిచ్చినది. ఫలానా తేదీలోగా ఉద్యోగం రాకుంటే.. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చెస్తానంటూ బురిడీ కొట్టించింది. చివరకు ఆమెది లోకల్ కావడంతో అక్కడకు వెళ్లి కూడా విచారించారు. ఇన్ని రోజులు ఆమె తిరిగి వస్తుందని ఆశించినట్లు అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement